ప్రజలను కేసీఆర్ గందరగోళానికి గురిచేస్తున్నారు: పొంగులేటి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన మాటలతో, చేతలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలమంతా తెలంగాణకు కాపలా కుక్కల్లా ఉంటామని తెలిపారు. పోలవరం డిజైన్ ను మార్చి ముంపుకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు.